అందాలతార నయనతార ప్రభుదేవాతో వ్యవహరం చెడగొట్టుకున్న తరువాత ఇప్పుడు సినిమాల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళం, మలయాళం లో వరసగా సినిమాలు చేస్తుంది.  కాగా, ఒప్పుకున్న ఒక మలయాళ సినిమాలో నుంచి ఇప్పుడు తప్పు కుంటానని నయన తార మరాం చేస్తుందట. వివరాల లోకి వెళ్తే.. ముమ్మటి హీరోగా చేస్తున్న ఒక సినిమాలో నయనతారను హీరోయిన్ గా ఎన్నుకున్నారు. నయనతార కూడా సినిమా చేయడానికి అంగీకరించింది. అయితే తరువాత చిత్ర దర్శక, నిర్మాతలతో ఏర్పడిన విభేదాల కారణంగా ముమ్మటి సినిమా నుంచి తప్పుకున్నాడు. సినిమాలోకి మరో హీరో వచ్చాడు. దీంతో నయనతార పేచీ పెడుతుంది. ముమ్మటి హీరో కాబట్టే నేను సినిమా చేయడానికి ఒప్పుకున్నానని, ముమ్మట్టి లేడు కాబట్టి నేను కూడా సినిమా చేయనని నయనతార భీష్మించుకుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: